నయన్ మాటల్లో... ''ప్రేమలో ఇద్దరి మధ్య తలెత్తే చిన్నచిన్న అపార్థాలూ, మనస్పర్థలను ఒక దశ వరకూ భరించొచ్చు. కానీ అవి భరించలేనంతగా ఉంటే విడిపోవడమే మంచింది. ప్రేమలో ఉన్నపుడు నాకు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి, అందుకే విడిపోవాల్సి వచ్చింది. సామాన్యులైనా, సెలెబ్రిటీలైనా భావోద్వేగాలనేవి అందరికీ ఒకలానే ఉంటాయి. ఓ దశలో ప్రేమ కోసం సినిమాలకు దూరమవుదామనుకున్నాను. ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. కానీ ఆ ప్రేమ అనే బాధ నుంచి బయటపడటానికి నాకు సినిమాలే మంచి ప్రత్యామ్నాయం అయ్యాయి. నా జీవితం నేను అనుకున్నట్లుగా ఎప్పుడూ సాగలేదు. అందుకే భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు.. అంత సమయం కూడా లేదు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాను'' అని నయన్ తెలియజేసింది. నిజంగా నయన్ మాటల్లో ఎంత బాధ ఉందో కదా? నయన్ నిజజీవితానికి కూడా ఒక హ్యాప్పీ ఎండింగ్ ఉండాలని కోరుకుందాం.
Mobile AppDownload and get updated news