ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం రెండు రోజులుగా పార్లమెంటును కుదిపేస్తుంది. ఏపీ ఎంపీలు ఉదయం నుంచి సభలో ప్రత్యేక హాదా అంశం పైనే చర్చ చేపట్టాలని ఆందోళన చేస్తున్నారు. కాగా ఆ ఆందోళనపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. తాము ఇప్పటికీ ఏపీకి సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీ ఎంపీల ఆందోళనను తాను అర్థం చేసుకున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై తాము చంద్రబాబుతో చర్చిస్తున్నామని తెలిపారు. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నామని, మార్గాలను వెతుకుతున్నామని అన్నారు. కానీ ప్రత్యేక హోదా ఇస్తామని కానీ, ఇవ్వమని కానీ ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.
Mobile AppDownload and get updated news