స్క్వాట్స్ వల్ల ఉపయోగాలు
మహిళలకు స్క్వాట్స్ వ్యాయామం చేయటం ఎంతో తేలిక. దీని వల్ల కండరాలన్నీ కదులుతాయి. పిరుదుల్లో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించుకోవచ్చు. శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. దీన్ని మహిళలు ఎక్కడైనా చేయవచ్చు. వంట చేస్తున్నపుడు కుక్కర్ విజిల్ వచ్చే వరకు ఇలాంటి వ్యాయామాన్ని చేసినా శరీరం ఫిట్‌గానే కాదు. ఉత్తేజాన్ని సంతరించు కుంటుంది. దీన్ని ఆచరిస్తే భుజాలు, చేతుల కండరాలకు ఎంతో మంచిది. అవి చురుకుగా కదులుతాయి. వారంలో కొద్దిరోజుల పాటు చేస్తే చాలు శరీరంలో ఎంతో మార్పు గమనిస్తారు. ఈ వ్యాయామం కాళ్లకు ఎంతో మేలు చేస్తోంది. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే శరీరం దీనికి అలవాటు పడుతుంది. కండరాలన్నింటికీ పని చెప్పటం వల్ల ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. ఎరోబిక్ వ్యాయామానికి ఇది ఏ మాత్రం తీసిపోదు. మానసిక ఒత్తిడి నుంచి తగిన ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడతాం. ఉదయం అన్ని వ్యాయామాల కంటే ఇది అతి ముఖ్యమైంది. మహిళలు వయసు రీత్యా రన్నింగ్ చేయటం కష్టమైతే వీటిని చేయటానికైనా ప్రయత్నించాలి. అయితే మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కాబట్టి కాస్త మోకళ్ల నొప్పులు ఉన్న వారు ఈ వ్యాయామం చేయకుండా ఉండడం మంచింది.
ఈ వ్యాయామాన్ని ఎలా చేయాలి
స్క్వాట్స్ చేయడంలో చాలా రకాలున్నాయి. అయితే అందులో బేసిక్ విధానాన్ని ఈ విధంగా చేయాలి. ముందుగా మీ పాదాలపై నిటారుగా నిలబడండి. తర్వాత రెండు కాళ్ల మధ్య కాస్త గ్యాప్ ఇస్తూ బ్యాలెన్స్ గా నిలబడండి. మీ ఉదర కండరాలను కాస్త గట్టిగా నొక్కి పట్టండి. ఉదరాన్ని కొద్దిగా ముందుకు నొక్కినట్లుగా ఉంచండి. అయితే చాలామంది పొట్ట భాగాన్ని ఎక్కువగా ముందుకు నొక్కి ఉంచుతారు. అది తప్పు పద్దతి. తర్వాత మీరు ఒక కుర్చీలో కూర్చునే యాంగిల్ లో డౌన్ కండి. నెమ్మదిగా కొద్దిసేపు అలాగే ఉండండి. తర్వాత పైకి లేవండి. మళ్లీ రిపీట్ అలాగే చేయండి. ఇలా చేసేటప్పుడు మీ రెండు చేతులను చాచి ఉంచాలి. మీకు సాధ్యమైనంత వరకు ఇలా చేయండి. సంపూర్ణ ఆరోగ్యం పొందాలనుకునే మహిళలు ఇలాంటి సులభమైన వ్యాయామాలను అలవాటు చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యాలను సాధించవచ్చు. ఎన్నో ఉపయోగాలుండి చాలా ఈజీగా చేసే వ్యాయామం కాబట్టే అమ్మాయిలకు స్క్వాట్స్ ఫేవరెట్ ఎక్సర్ సైజ్ గా మారింది.
Mobile AppDownload and get updated news