Mobile AppDownload and get updated news
రియో ఒలింపిక్స్ పురుషుల 10.మీ ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ జితూరాయ్ ఫైనల్ లో నిరాశ పరిచాడు. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో జితూరాయ్ తన ఆరో సిరీస్ కల్లా 580 పాయింట్లు సాధించాడు. నాలుగో సిరీస్ పూర్తయ్యే సరికి 11వ స్థానంలో ఉన్న జితూరాయ్ తదుపరి రెండు సిరీస్ లూ పూర్తి చేసి ఆరవ స్థానంలో నిలిచి ఫైనల్స్ కు చేరుకున్నాడు. భారత్ కు చెందిన మరో షూటర్ గుర్ ప్రీత్ సింగ్ ఫైనల్స్ కు క్వాలిఫై అవ్వడంలో విఫలమయ్యారు. జితూ.. ఫైనల్లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. 78.7 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి తొలి ఎలిమినేటర్‌గా వెనుదిరిగాడు. ఈ ఈవెంట్‌లో వియాత్నానికి చెందిన హోయాంగ్ 202.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. ఆతిథ్య బ్రెజిల్ ఆటగాడు ఫెలిపీ అల్మెడా 202.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించగా.. మూడో స్థానంలో నిలిచిన చైనా ఆటగాడు పాంగ్ వెయ్ 180.4 పాయింట్లతో కాంస్యం చేజిక్కించుకున్నాడు.