రియో ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ క్రీడాకారులు పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నారు. తొలుత పురుషుల డబుల్స్‌లో పేస్-బోపన్న జోడి ఓటమిపాలు కాగా, మహిళల డబుల్స్‌లోనూ అదే తరహా ఫలితం వచ్చింది. చైనా క్రీడాకారిణులు జంగ్- పెంగ్ చేతిలో భారత టెన్నిస్ ద్వయం సానియా మీర్జా- ప్రార్థన తోంబ్రే ఓటమిపాలయ్యారు. సానియా మీర్జా మెరుగ్గానే ఆడినప్పటికీ ప్రార్థన నుంచి సరైన సహాకారం లభించలేదు. దీంతో 6-7, 5-7, 7-5 తేడాతో మ్యాచ్ చేజారింది. టెన్నిస్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రమే భారత్‌కు పతకం సాధించే అవకాశాలున్నాయి. సానియా మీర్జాతో రోహన్ బోపన్న జతకట్టనుండటంతో ఈ జోడీ పతకంతో తిరిగొస్తుందని భావిస్తున్నారు.
Mobile AppDownload and get updated news