మన హాకీ పురుషుల టీమ్ చేదు వార్తనే ఇచ్చింది. రియో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన పూల్-బి మ్యాచ్‌లో భారత హాకీ జట్టు ఓటమి పాలైంది. అటు అభినవ్ బింద్రా షూటింగ్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో మెడల్ ను కోల్పోగా, ఇటు పరుషుల హాకీ జట్టు జర్మనీపై 2-1 తేడాతో ఓటమి పాలైంది. ఐర్లాండ్ పై సత్తా చాటిన భారత్ టీమ్ జర్మనీ టీం ను మట్టి కరిపిస్తుందనుకుంటే ఇలా జరిగింది. మొదట్లో మనవాళ్లే గేమ్ లో ముందంజలో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఓటమి ఎదురైంది. 17వ మినిట్ లో జర్మనీ ప్లేయర్ వెల్లెన్ నిక్లాస్ ఫస్ట్ గోల్ చేశాడు. రూపిందర్‌పాల్ సింగ్ 22వ మినిట్ లో గోల్ చేయడంతో స్కోర్ సమానమైంది. ఆ తర్వాత రెండు జట్లు గోల్ కోసం పోటాపోటీగా ఆడాయి. మ్యాచ్ ముగుస్తుందనే సమయంలో క్రిస్టోఫర్ 59వ మినిట్ లో గోల్ చేయడంతో మనం ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. లాస్ట్ 3.1 సెకన్స్ టైం ఉండగా వాళ్లు గోల్ కొట్టేశారు. ఇది గ్రూప్ బీ లో జరిగిన సెకండ్ మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ పై 3-2 తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Mobile AppDownload and get updated news