రియో ఒలింపిక్స్‌లో భారత మహిళల ఆర్చరీ టీమ్ లక్ష్మీరాణి, బాంబేలా దేవి, దీపిక కుమారి కొలంబియాపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ కు చేరుకోవడం తర్వాత రష్యాపై ఈ టీమ్ ఓడిపోవడం తెలిసిందే. అయితే తాజాగా రియో ఒలింపిక్స్ లో ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో ఎలిమినేషన్ రౌండ్ లో భారత క్రీడాకారిణి లక్ష్మీరాణి మాఝి ఓటమిని చవిచూసింది. ఇలా వరుసగా మన ఆర్చరీ క్రీడాకారిణులు నిరాశమిగిలిస్తూనే ఉన్నారు. స్లొవేకియా క్రీడాకారిణి అలెగ్జాండ్రా లంగోవాతో జరిగిన పోటీలో లక్ష్మీరాణి మాఝి 1-7తో ఓటమి పాలైంది. తొలి రెండు సెట్లు చేజార్చుకున్న ఆమె 0-4తో వెనకబడింది. ఇక మూడో సెట్లో లక్ష్మీరాణి, అలెగ్జాండ్రా లంగోవాలు 26-26 పాయింట్లు చేశారు. ఇద్దరూ సమానంగా స్కోరు చేయడంతో చెరో పాయింట్ పంచుకున్నారు. నాలుగో సెట్లో అలెగ్జాండ్రా 27 స్కోరు చేయగా లక్ష్మి కేవలం 24 మాత్రమే చేయడంతో ఓటమి ఖరారైంది.
Mobile AppDownload and get updated news