Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85987

'జనతా గ్యారేజ్' ఆడియో లాంచ్ డేట్ పోస్టర్

$
0
0

'జనతా గ్యారేజ్' ఆడియో లాంచింగ్ డేట్‌ని ఖరారు చేస్తూ తాజాగా ఆ మూవీ మేకర్స్ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ లుక్స్‌లో ఇంటెన్సిటినీ చక్కగా ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్‌లో అతడి చుట్టూ వున్న మిగతా క్యారెక్టర్స్‌ని బ్లర్ చేసి, కేవలం ఎన్టీఆర్ హైలైట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆగస్టు 12న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక సాక్షిగా ఈ సినిమా ఆడియో లాంచ్ కానుందనే సంగతి అభిమానులకి, బయటి ప్రపంచానికి నాలుగు రోజుల క్రితమే తెలిసినప్పటికీ.. ఈ తాజా పోస్టర్ విడుదలతో ఆ తేదీ అధికారికంగా కన్ఫర్మ్ అయిపోయినట్టేననే సంకేతాలని ఇచ్చింది జనతా గ్యారేజ్ యూనిట్.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, మోహన్ లాల్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. సమంత, నిత్యామీనన్‌లు ఫీమేల్ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85987

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>