రియో ఒలింపిక్స్ లో ఇండియా స్మిమ్మర్స్ సత్తా చాటలేకపోయారు. కేరళ రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల సాజన్ ప్రకాష్ 200 మీటర్లు బటర్‌ఫ్లై లో అద్వితీయైన ప్రతిభ ఉంది. ఇండియన్ మైఖేల్ ఫైల్ఫ్స్ గా ముద్దుపేరు ఉంది. ఇండియన్ రైల్వేస్‌లో క్లర్ గా పనిచేస్తున్న ఇతను ఇండియా తరఫున ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే రియోలో 200 మీటర్ల బటర్ ఫ్లై పోటీని ఒక నిమిషం 59:37 సెకన్ల సమయంలో పూర్తి చేసిన ప్రకాశ్ నెస్ట్ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయాడు. మొత్తం ఈ పోటీలో 43మంది స్మిమ్మర్లు పాల్గొన్నారు. 41 వస్థానంలో ప్రకాశ్ నిలిచాడు. అలాగే మహిళా స్విమ్మర్ శివానీ కటారియా 200మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్ లో పోటీ పడింది. ఈమె 2:09:31 సెకన్లలో ఈవెంట్ ను పూర్తి చేసి 28వ స్థానంలో నిలిచింది. దీంతో నెస్ట్ రౌండ్ కు అర్హత సాధించలేకపోయింది. ఇందులో మొత్తం 29 మంది స్మిమ్మర్స్ పాల్గొన్నారు.
Mobile AppDownload and get updated news