బ్రెజిల్ లోని రియో లో ఒలింపిక్స్ జరుగుతున్న ప్రాంతంలో కాల్పుల కలకలం రేగింది. ఒలింపిక్స్ ను కవర్ చేయడానికి దేశ, విదేశాలకు చెందిన మీడియా వ్యక్తులెందరో ఒలింపిక్ విలేజ్ వచ్చారు. మంగళవారం అర్థరాత్రి వారంతా బస్సులో బాస్కెట్ బాల్ వేదిక నుంచి ప్రధాన వేదికకు బస్సులో వెళుతున్నారు. మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తి బస్సుపై కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ బస్సు అద్దాలను చీల్చుకుంటూ లోపలికి వచ్చి, ఓ జర్నలిస్టుకు తగిలింది. అతను స్వల్పంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ఇలా ఉండగా... అధికారులు మాత్రం భిన్నమైన వాదన వినిపించారు. కాల్పులు జరిగి ఉండవని, అందుకు అవకాశమే లేదని అన్నారు. బస్సులోకి వచ్చింది బుల్లెట్, రాళ్లో తెలియాల్సి ఉందన్నారు. ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోందని రియో క్రీడల అధికారి తెలిపారు.
Mobile AppDownload and get updated news