Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85958

ఆ రిపోర్టర్‌కు నయీం వార్నింగ్

$
0
0

ఇది ఏడెనిమిదేళ్ల కిందటి మాట...అప్పట్లో అధికారంలో ఉండే ప్రభుత్వాలు నయీం ఆగడాలను అడ్డుకోకపోవడం పక్కనబెడితే అతనేం చేసినా ఎంకరేజ్ చేసినట్లు వ్యవహరించేవి. దీంతో నయీం ఆగడాలకు అడ్డుపు అదుపు లేకపోయేది. సరిగ్గా ఆ సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఊపందుకుంటోంది. ఇరవై నాలుగు గంటల న్యూస్ ప్రసారాలు లేకపోయినా..ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లే అర్థగంటపాటు న్యూస్ బులెటిన్లు ప్రసారం చేస్తున్నాయి. భూ కబ్జాలు, అక్రమణలు, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులు, నేతలపై ఓ ఛానల్ క్రైం బీట్ ప్రతినిధి..మీడియాలోకి ఎంటరైన కొత్తలో తనను తాను నిరూపించుకోవాలని స్టోరీల మీద స్టోరీలు చేస్తున్నాడు. అతను చేస్తున్న స్టోరీలకు రెస్పాన్స్ కూడా బాగా ఉండేది. దీంతో నయీం ఇలాకలో జరిగిన ఓ దందాపై ఆ ప్రతినిధి స్టోరీ చేశాడు. ఆ దందా వెనకాల గ్యాంగ్‌స్టర్ నయీం ఉన్నాడంటూ డైరెక్టర్‌గా పాయింట్‌కొచ్చాడు. అప్పటి నయీం ఫొటోలు వాడి స్టోరీ ఒకటి చేశాడు. నయీం దందాపై వచ్చిన ఆ బులిటెన్ అలా ముగిసిందో లేదో నయీం నుంచి ఆ స్టోరీ చేసిన క్రైం రిపోర్టర్‌కు ఫోన్ వచ్చింది. 'అర్థగంటలో నిన్ను చంపేస్తా'నంటూ బెదిరించాడు. దీంతో ఆ ప్రతినిధి భయపడిపోయి న్యూస్ ఎడిటర్‌కు విషయం చెప్పాడు. మళ్లీ నయీం ఫోన్ చేస్తే ఎడిటర్ ఫోనందుకున్నాడు. 'మావోడు తెలియక మీపై స్టోరీ చేశాడు. వదిలేయండి. నయీం భాయ్' అని ఎడిటర్ బతిమాలాడు. సారీ చెప్పాడు. రిపోర్టర్‌తోనూ సారీ చెప్పించాడు. అయినా నయీం వినిపించుకోలేదు. మరోపక్క ఆ రిపోర్టర్‌కు ఒళ్లంతా చెమటలు పట్టుకున్నాయి. ఉన్న నాలుగు బులెటిన్లు అయిపోయి రాత్రి కావస్తున్న ఎడిటర్ సహా ఏ ఒక్కరూ ఛానల్ ఆఫీస్ గడపదాటి బయటకి వెళ్లడం లేదు. బయటికెళ్తే నయీం ఏం చేస్తాడోనన్న భయంతో రాత్రంతా ఆఫీసులోనే ఉన్నారు. రక్షణ కోసం పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆఫీసు చుట్టూ గట్టి భద్రత కూడా ఏర్పాటు చేసుకున్నారు. అర్థరాత్రి దాకా ఫోన్ చర్చల్లో నయీం కూల్ అయ్యాడు. అప్పటికీగానీ ఆఫీసు స్టాఫంతా ఊపిరిపీల్చుకోలేదు. ఇక అంతే, ఆ తరువాత నుంచి ఆ క్రైం రిపోర్టర్ నయీంకు సంబంధించిన స్టోరీలే కాదు ఏఇతర దందాలపై చాలా కాలం దాకా 'కన్నేయడం' మానేశాడు. ఆ తరువాత ఛానళ్లు పెరగడం, ఇప్పుడు ఆ రిపోర్టర్ క్రైం బీట్‌లో సీనియర్‌గా కొనసాగుతుండటం వేరే విషయం. కానీ, ఆ సంఘటన తర్వాత చాలాకాలం దాకా ఏ ఇతర మీడియా కూడా నయీం చేస్తున్న ఆగడాలు, అన్యాయాలపై, ఆయన అనుచరులపై కూడా ఏలాంటి 'ఫోకస్' పెట్టలేదు. దటీస్ నయీం. ఇరవయ్యేళ్లపాటు 'పగటి'సామ్యాజ్యాన్ని ఏలిన నయీం హిట్ లిస్టులో మీడియా ప్రతినిధులు కూడా ఉండటం ఆశ్చర్యమేం కాదని చాలామంది అభిప్రాయం. ఎందుకంటే తాను చేస్తున్న, చేయిస్తున్న పనుల్లో మీడియాకంట పడకుండా ఉండేందుకు వారికీ చేతులు తడిపేవాడు. మాట వినకుండా, ఎదురుతిరిగిన జర్నలిస్టులను టార్గెట్‌గా చేసుకునేవాడు. ఈనేపథ్యంలోనే నయీం తన హిట్ లిస్టులో నేతలు, రాజకీయ నేతలు ఎలా ఉంటారో వారితోపాటే మీడియా ప్రతినిధులను కూడా చేర్చాడు. అయితే వందలకుపైగా పేర్లతో వివిధ రంగాలకు చెందిన వారి హిట్ లిస్టు పోలీసు సోదాలో దొరకడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. బతికున్నప్పుడు గ్యాంగ్‌స్టర్‌గా పొలిటీషియన్లు, బడా వ్యాపారులకు ముచ్చెమటలు పట్టించిన నయీం..పోలీసు అధికారులు, మీడియా పెద్దలతోనూ అంతేస్థాయిలో ఆడుకున్నాడు. ఒకటా రెండా, వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనతో చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించిన నరహంతకుడు నయీం..కన్నపడ్డ భూములను తన కాళ్ల కిందకు తెచ్చుకున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ అండర్ వరల్డ్ (ఒక రకంగా బాహ్య ప్రపంచపు డానే) రిస్టార్టులు, పొలాలు, తోటలు సంపాదించాడు. అంతేకాదు అడ్డొచ్చిన ఎవరినీ వదల్లేదు. మాయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారమిచ్చే నయీం...ఉగ్రవాద కార్యకలపాలకు ఊతమిచ్చే కార్యక్రమాలూ చేపట్టాడు. తాను చేసే, చేయించే భూదందానే కాదు ఏదందాలో అయిన వేలుపెడితే పోలీసులు, నేతలు చివరికి మీడియాను వదల్లేదు.
మరోవైపు నయీంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు నెరపిన పైస్థాయి నుంచి కిందిస్థాయి దాకా పోలీసులు, రాజకీయ నేతలు, మీడియా పెద్దలు, స్థానిక విలేకర్లపై పోలీసులు ఓ నజర్ పెట్టారు. మరోవైపు నయీం ఆగడాలకు బలైపోయిన కుటుంబాలు, బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే, నయీం ఎన్‌కౌంటర్ తర్వాత కథ ముగియలేదనేది స్పష్టం. ఎందుకంటే వేలాది కోట్ల రూపాయల వివిధ రకాలైన 'బిజినెస్'లతో సంబంధమున్న వాళ్లు, నయీం అనుచరులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటే తప్ప నయీం శకం ముగిసినట్లు కాదు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85958

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>