ఆమ్ ఆద్మీపార్టీ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ ఆస్తుల గుట్టును.. ఆదాయపన్ను శాఖ రట్టు చేసిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న సమాచారంతో తాజాగా సోదాలు నిర్వహించిన అధికారులు.. అక్రమ ఆదాయం రూ.130 కోట్ల వరకూ ఉన్నట్లుగా గుర్తించారు. ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు రికవరీ చేశారు. కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. గతంలో బీజేపీ నేతగా ఉన్న తన్వర్ 2014 లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. కాగా ఈ ఇన్సిడెంట్ పై సోషల్ మీడియాలో ఫన్నీ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని మీరూ చూడండి.
Mobile AppDownload and get updated news