రియో ఒలింపిక్స్ లో అమెరికా స్టార్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా మరో రెండు బంగారు పతకాలు సాధించాడు. తాజాగా సాధించిన పతకాలతో అతడి ఖాతాలో 25 ఒలింపిక్ పతకాలు ఉన్నాయి. ఇందులో 21 బంగారం, 2 రజతాలు, 2 కాంస్య పతకాలున్నాయి. మరి ఇలాంటి బంగారు చేప ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఫెల్ప్స్ పై కొందరు ఫన్నీగా చేసే ట్వీట్స్ ప్రజెంట్ గా వైరల్ అవుతున్నాయి. 'ఒలింపిక్స్ లో ఇండియా 116 ఏళ్లలో మొత్తం 26 పతకాలు సాధిస్తే.. ఫెల్ప్స్ ఒక్కడే 25 పతకాలు సాధించాడు. మనం ఒక్కటే లీడ్ లో ఉన్నాం' అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నెస్ట్ మైకేల్ ఫెల్ప్స్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. అందులో కొన్ని మీరూ చూడండి.