Mobile AppDownload and get updated news
కేరళకు చెందిన వ్యక్తికి వారం రోజుల్లోనే రెండు భారీ అదృష్టాలు కలిసివచ్చాయి. ఒకటి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటే, ఇంకోటి లక్ష్మీదేవి లాటరీ రూపంలో ఇంటి తలుపు తట్టింది. ఆ అదృష్ట వంతుడు ఎవరో తెలుసా? కేరళకు చెందిన మహ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదర్. అతను ఈ నెల 3న తిరువనంతపురం నుంచి దుబాయ్ కి వెళ్లిన ఎమిరేట్స్ విమానం ఎక్కాడు. దుబాయ్ విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయిన విమానం మంటల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ప్రయాణికులంతా చకచకా దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. కొందరికి స్వల్పగాయాలయ్యాయంతే. అలా ఖాదర్ కూడా బతికిపోయాడు. గాయాలకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 30 ఏళ్ల నుంచి ఆయన దుబాయ్ లోనే ఉంటున్నాడు. అతనికి లాటరీ టిక్కెట్లు కొనే అలవాటు ఉంది. అతను ఆసుపత్రిలో ఉండగానే.... అతను కొన్న టిక్కెట్ కు లాటరీ తగిలింది. ఆ టిక్కెట్ల డ్రాను కూడా దుబాయ్ ఎయిర్ పోర్టులోనే తీయడం గమనార్హం. ఆ లాటరీతో 6.67 కోట్ల రూపాయలు కలిసి వచ్చాయి. 67ఏళ్ల ఖాదర్ పని మాని విశ్రాంతి తీసుకుందామని ఆలోచిస్తున్న సమయంలోనే ఆ లాటరీ తగలడం నిజంగా అదృష్టమే.