పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన హీరోయిన్ దిశా పటాని దశ మామూలుగా తిరగట్లేదు. లోఫర్ సినిమాకి మిశ్రమ స్పందన లభించడంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు లభిస్తాయా అనుకునే టైంలో బాలీవుడ్‌లో ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న 'ఎం.ఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ధోనీ లవర్ గా దిశ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే ఇప్పుడు ఏకంగా దిశా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేస్తుంది. షూటింగ్ సమయంలో దిశా నటనకు ముగ్దుడైన జాకీచాన్ తనకు హాలీవుడ్ అవకాశాలు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారట. జాకీచాన్ నిర్మాణ సంస్థ వ్యవహారాలను చూసుకునే ఓ సంస్థకు దిశా పేరును సిఫార్సు చేశారు. 'కుంగ్ ఫూ యోగా' అనే సినిమాలో జాకీచాన్ తో కలిసి దిశా పటానీ నటించనుంది. జాకీచాన్ ఓ గురువులా తనకు సహాయం చేస్తున్నారని దిశా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. మొదటి సినిమా టాలీవుడ్‌లో , రెండో సినిమా బాలీవుడ్‌లో, మూడో సినిమా హాలీవుడ్‌లో.. ఎంతైనా అదృష్టం అంటే దిశా పటానిదే.
![]()
Mobile AppDownload and get updated news