Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85977

ఇన్ఫోసిస్ టెక్కి నిమ్మ సాగులో మేటి

$
0
0

పేరు మోసిన కంపెనీల్లో ఉద్యోగం...నెల దాటగానే ఒకటో తారీఖున ఠంచన్‌గా జీతం..దానికితోడు ఇతరత్రా అలవెన్సులు..ఊరించే జీతాలు, ఊరడించే అలవెన్సులు అతణ్ని ఏమాత్రం ఆపలేకపోయాయి. 9-5 ఉద్యోగంకంటే వ్యవసాయంలో అసలు మజా ఉందని భావించిన ఆ యువకుడు కొలువుకు నమస్కారం పెట్టి...నిమ్మకాయల పంట సాగులో రూ.లక్షలు సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే...బెంగళూరులోని ఉడిపి ప్రాంతానికి చెందిన సుధీష్ శెట్టి యూనివర్సిటీ ఆఫ్ విశ్వేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీఈ పట్టా పొందాడు. పట్టా అందుకున్న వెంటనే ఇన్ఫోసిస్, విఫ్రో లాంటి ప్రఖ్యాత సాప్ట్ వేర్ కంపెనీల్లో కొంతకాలం పనిచేశాడు. కంపెనీలు మారినా, జీతాలు పెరిగినా అవేవీ తృప్తినివ్వకపోవడంతో సుధీష్..సొంతూరులో ఉన్న వ్యవసాయ పొలంలో నిమ్మకాయలు పండించడం మొదలుపెట్టాడు. మొదట దీన్నో పార్ట్ టైం జాబ్ గా చేశాడు. నిమ్మకాయల సాగు సిరులు పండించడంతో దీన్నే ప్రధాన వృత్తిగా ఎంచుకొని ఐదేళ్లుగా ఈ రంగంలో కొనసాగుతున్నాడు. మొదటి సంవత్సరం ఒక్కో చెట్టు 50 నిమ్మకాయల దాకా ఇచ్చేది. పకడ్బందీ సాగు చేపట్టే సరికి మూడేళ్ల నుంచి ఒక్కో చెట్టు 350 నుంచి 400దాకా నిమ్మకాయలు కాస్తూ సుధీష్ కు ఐదేళ్లుగా భారీగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. 'మా తల్లిదండ్రులకు 20ఎకరాల పొలం ఉంది. అందులో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. వరి పండించాలనుకున్నారు కానీ, కోత సమయంలో పనివాళ్లు దొరకడం లేదు. అది ఇబ్బందిగా మారడంతో తక్కువ పనివాళ్లతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే నిమ్మకాయల సాగుకు సిద్ధమయ్యాను. 2ఎకరాల్లో నిమ్మకాయలు పండిస్తున్నాం. మిగతా పొలంలో తాటిచెట్లు, కొబ్బరిచెట్ల సాగు కొనసాగుతోంది. వారానికోసారి పంట తీయవచ్చు. మే నుంచి జూలై వరకు నిమ్మకాయలకు బాగా గిరాకీ ఉంటుంది.' అని చెబుతున్నాడు సుధీష్. సీజన్ లో ఒక్కో నిమ్మకాయల చెట్టు ఒక్కో వారానికి రూ.3000 నుంచి రూ, 5000వరకు లాభాలు తెచ్చిపెడుతుంది. మిగతా నెలల్లో కూడా ఒక్కో చెట్టు ఎంతలేదన్నా రూ.500దాకా వ్యాపారం చేస్తోంది. 'సీజన్ తో నిమ్మితం లేకుండా అన్ని కాలల్లో నిమ్మకాయలకు డిమాండ్ ఉంటుంది. ఎండకాలంలో మార్కెట్లో ఒక్కో నిమ్మకాయ రూ.3, మిగతా కాలాల్లో రూ.1 పలుకుతుంది. నిమ్మకాయల సాగుకు తెగుల బెడద పెద్దగా ఉండదని, లేబర్ వర్క్ కూడా పరిమితంగా ఉంటుందని సుధీష్ చెబుతున్నాడు. పూత పూసే సమయం కొన్ని జాగ్రత్తలు పాటించాలని, ఒక్కో ప్రాంత వాతావరణానికి తగ్గట్లు వాటిని సాగు చేయాలని ఆయన సూచిస్తున్నాడు. ఒక్కో పంట ద్వారా దాదాపు రూ.లక్ష నుంచి 1.15లక్షల దాకా లాభాలు గడించవచ్చని అంటున్నాడు. నాణ్యతగల మొక్కలు నాటితే అధికోత్పత్తి వస్తుందని, నాసిరకం చెట్లకు దూరంగా ఉండాలని మాజీ ఇంజనీరు తాజా యువ రైతు సలహా ఇస్తున్నాడు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85977

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>