ఢిల్లీలోని కురేజీ ప్రాంతంలో ఉన్న ఓ బేకరీలో పేలుడు సంభవించింది. ఆ పేలుడులో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గురువారం ఉదయం అయిదున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు సంభవించడానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఉగ్ర కుట్ర ఏమీ లేదనే వాదన వినిపిస్తోంది. బేకరీలో వాడే గ్యాస్ సిలిండర్ లేదా, ఓవెన్ పేలడం వల్ల ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక దళం, బాంబు నిర్వీర్య సిబ్బంది... అందరూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించి, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు ఎలాంగి ఉగ్రకుట్ర ఉన్న ఆనవాళ్లు బయటపడలేదు.
Mobile AppDownload and get updated news