Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85958

డాక్టర్లు, నర్సుల మధ్య ముదిరిన బ్లడ్ వార్

$
0
0

ప్రఖ్యాత ఎయిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు, నర్సుల మధ్య బ్లడ్ వార్ మొదలైంది. రక్త పరీక్షల కోసం వచ్చే పేషంట్ల నుంచి రక్తనమునాలు ఎవరు సేకరించాలి? నమునా ఫలితాల బార్ కోడ్లను ఎవరు నమోదు చేయాలి? డాక్టర్లా? లేక నర్సులా? ఈ రక్త పరీక్షల వ్యవహారం ఇప్పుడు ఎయిమ్స్ వంటి పెద్ద ఆసుపత్రిలోని డాక్టర్లు నర్సుల మధ్య అగ్గిరాజేసింది. రోగి ప్రాణాలతో సంబంధించిన వ్యవహారం గనుక రక్త నమూల సేకరణ, నమోదు వంటి పనులు డాక్టర్లే చేయాలని నర్సులు వాదిస్తుండగా... వందలాది పేషంట్లను పరీక్షించడంలోనే రోజంతా గడపుతున్నాం..ఇక రక్తపరీక్షలు మా వల్ల కాదని, దాని వల్ల పనిఒత్తిడి పెరుగుతుందని డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ డాక్టర్ల నర్సుల మధ్య 'బ్లడ్ వార్' గా మారిపోయింది. తమకో పరీక్షలా మిగిలిన రక్త పరీక్షల సంగతి తేల్చాలంటూ రెసిడెంట్ డాక్టర్లు ఎయిమ్స్ డైరెక్టర్ కు మంగళవారం లేఖ రాశారు. బ్లడ్ శాంపిల్స్ తామే చేయాలని నర్సులు చేతులెత్తయడంతో పనిభారం తమపైనే పడుతుందని ఆగస్టు 26 నుంచి తాము కూడా బ్లడ్ శాంపిల్ సేకరణ నిలిపివేస్తున్నామని రెసిడెంట్ డాక్టర్ల సంఘం కార్యదర్శి డాక్టర్ హర్జిత్ సింగ్ భట్టి వెల్లడించారు. 'బ్లడ్ శాంపిల్ పనులు, పేషంట్ల బాగోగులు నర్సులే చూసుకోవాలి. బ్లడ్ శాంపిల్స్ మేమే చూడటం వల్ల పేషంట్లను చూసేందుకు సమయం ఉండటం లేదు.' అని ఆయన వాపోయారు. అమెరికా వంటి దేశాల్లో రక్త నమూల సేకరణ, పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బంది ఉంటుందని డాక్టర్ సింగ్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రక్త పరీక్షలు, విచారణ వంటి పనులు రెసిడెంట్ డాక్టర్లే చేయాలని ఎయిమ్స్ నర్సింగ్ యూనియన్ అంటోంది. నర్సులపై పనిభారం పెంచేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. పేషంట్లకు నర్సుల నుంచి ఏదైనా సేవల లోపం జరిగితే అప్పుడు ఎయిమ్స్ దే పూర్తి బాధ్యత అని నర్సింగ్ యూనియన్ సభ్యులు అంటున్నారు. అయితే ఎయిమ్స్ న్యోరో జర్జన్ డాక్టర్ దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ రక్త నమూల సేకరణ, నమోదులో ఏ చిన్న పొరపాటు జరిగిన రోగి ప్రాణాలకే ప్రమాదం. అందువల్ల రక్త సేకరణ డాక్టర్ల సమక్షంలోనే జరగాలి' అని సూచిస్తున్నారు. అయితే 20మంది ఉండాల్సిన రెసిడెంట్ డాక్టర్లు కేవలం ఏడు మంది మాత్రమే ఉన్నారు. దీంతో పేషంట్లను పరీక్షించడానికే వారు అధిక సమయం కేటాయించాల్సి వస్తుంది. వేలాది రోగులను జూనియర్ల డాక్టర్లే పరీక్షిస్తున్నారని ఆయన అన్నారు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85958

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>