Mobile AppDownload and get updated news
కేరళ తిరువనంతపురంలోని పులువిల్లలో వీధి కుక్కలు చెలరేగిపోయాయి. 50 దాకా ఉన్న వీధి కుక్కల గుంపు 65ఏళ్ల వృద్ధురాలిని కరిచి, ఆమె శరీరంలోని సగభాగం తినేసి ప్రాణాలు తీశాయి. శీలుఅమ్మ సముద్రతీరంలో నడుచుకుంటూ వెళ్తూ టాయిలెట్ చేసేందుకు కాస్త దూరం వెళ్లింది. అంతే ఎక్కడినుంచో వచ్చిన భారీ శునకపు గుంపు ఆమె పడింది కరిచాయి. కుక్కల చప్పుడు, శీలుఅమ్మ అరుపులకు ఆమె తనయుడు వెంటనే పరుగెత్తుకొచ్చాడు. రాళ్లతో ఎంత కొట్టినా అవి పారిపోకపోగా అతడి వెంటకూడా పడ్డాయి. దీంతో కుక్కల గుంపును తప్పించుకునేందుకు అతడు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. కుక్కల తీవ్రంగా గాయపడ్డ శీలఅమ్మను సమీపంలోని మెడికల్ కాలేజీలో చేర్పించగా..చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందింది. కుక్కల దాడికి గురైన శీలుఅమ్మ శరీరాన్ని కుక్కులు పాక్షికంగా తినేసిట్లు వైద్యులు గుర్తించారు. 'వీధి కుక్కలు, పిచ్చి కుక్కలను చంపనీయకుండా అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారు. కుక్కల్ని చంపకూదంటూ చట్టం ఉందని ప్రజల ప్రాణాలు తీస్తున్నారని అధికారులపై మండిపడుతున్నారు. శీలుఅమ్మ కుక్కల దాడికి గురైన కాసేపటికే మరోమహిళ, డైసీ(50)కూడా అదే గుంపు చేతిలో తీవ్రంగా దాడికి గురయ్యారు.