రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు రజత పతకాన్ని అందించిన తెలుగు తేజం పి.వి.సింధుకు ఢిల్లీ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది.భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలల ఇనుమడింపజేసిన ఆమెకు రూ.2 కోట్ల నజరానా అందించనున్నట్లు శనివారం కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. ఆమె ప్రతిభకు మెచ్చి తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి నజరానా, భారత బ్యాడ్మింటన్ సమాఖ్య రూ.50 లక్షలు, మధ్య ప్రదేశ్ సర్కార్ రూ.50 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సింధుతో పాటు ఒలింపిక్స్‌లో తొలి కాంస్య పతకాన్ని సాధించిన హర్యానకు చెందిన రెజ్లర్ సాక్షి మాలిక్ రూ.కోటి నజరానా ఇవ్వనున్నట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటన విడుదల చేసింది. రియో ఒలింపిక్ బ్యాడ్మింటన్ విభాగం ఫైనల్ మ్యాచ్ లో సింధూ పోరాడి ఓడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Mobile AppDownload and get updated news