మరోవైపు ఈ సినిమా ప్రొడ్యూసర్, చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తన తండ్రికి ఓ స్పెషల్ పెయింటింగ్ ను గిఫ్ట్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడు. ఆ పెయింటింగ్ లో ఏముందనేది కూడా 'డాడీకి ఇచ్చిన తర్వాతే అందరికీ రివీల్ చేస్తాను' అని చెప్పాడు.
ఈ సందర్భంగా , చెర్రీ తన తండ్రి అంకిత భావాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఠాగూర్ సినిమా సమయంలో 'కొడితే కొట్టాలిరా..' అనే పాట షూటింగ్ సమయంలో చెర్రీ అక్కడే ఉన్నాడట. చిరు డ్యాన్స్ చేస్తుండగా ఆయన మోకాలి దగ్గర ఏదో సౌండ్ రావడంతో డైరెక్టర్ వి.వి వినాయక్, చరణ్ బాగా కంగారు పడ్డారట. అప్పటికీ.. ఐస్ పెట్టుకొని మరీ చిరు ఆ పాట పూర్తి చేశారట. ఆ సమయంలో నాన్న బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని, ఆ తర్వాత మోకాలికి ఆపరేషన్ కూడా జరిగిందని చరణ్ చెప్పాడు.. 50 సంవత్సరాల వయసులో ఆయన అలా డాన్స్ చేయడం మామూలు విషయం కాదనీ.. నాన్ననుంచి చాలా నేర్చుకోవాలని చెర్రీ అన్నాడు.
ఏదైతేనేం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ 150వ సినిమా ఫస్ట్‌లుక్ మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. ఈ ఫస్ట్‌లుక్ ఎలా ఉండబోతోంది? టైటిల్ ఏంటి అని అందరూ అత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Mobile AppDownload and get updated news