Mobile AppDownload and get updated news
దేశంలో అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న సాంకేతిక పరిజ్ఞాన కాలేజీలు (ఐఐటీ), ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) విద్యాసంస్థలల్లో యేటా డ్రాపవుట్లు పెరిగిపోతున్నాయి. ఇందులో అత్యధికంగా పరిశోధనలు (పీ.హెచ్.డీ)లు కొనసాగిస్తున్న విద్యార్థులే ఉండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న ఐఐటీ, ఐఐఎం అడ్మిషన్లు పరిశీలిస్తే 2014 నుంచి 2016 విద్యాసంవత్సరంలోనే ఐఐటీ-ఢిల్లీ సంస్థ నుంచి 699 మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే వదిలేశారు. ఇదే సంవత్సరాల్లో ఐఐటీ-ఖరగ్ పూర్ లో 544 మంది విద్యార్థులు డ్రాఫవుట్లు కాగా, ఐఐటీ-బాంబేలో 143 మంది విద్యార్థులు మధ్యలోనే చదువులు వదిలేసి ఇంటిముఖం పట్టినట్లు రికార్డులు చెబుతున్నాయి. అటు ఐఐఎంలలోనూ ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలలో 2003 నుంచి 2005 విద్యాసంవత్సరాల్లో 37 మంది మధ్యలోనే చదువులు వదిలేయగా, 2006-2008 మధ్య కాలంలో 69 మంది డ్రాఫవుట్స్ గా మిగిలారు. 2014 నుంచి 2016 విద్యాసంవత్సరంలో పరిశీలిస్తే వీరి సంఖ్య 104కు చేరడం గమనార్హం. 'విద్యార్థులు మధ్యలోనే తమ చదువులు వదిలేయడానికి తమ కోర్సుల్లో వెనుకబడి పోవడం మాత్రమే కారణం కాదని' ఐఐఎం-కలకత్తాకు చెందిన ఫ్యాకల్టీ ఒకరు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ అమ్మాయి, అబ్బాయి ఎవరూ చేరినా ఏలాంటి వివక్ష ఉండదని, అందరికీ ఒకరకైన ట్రీట్ మెంట్ ఉంటుదని ఆయన అన్నారు. మరోవైపు ఆరేళ్లు కూడా నిండని ఐఐటీ-రాంపూర్ నుంచి 20మంది విద్యార్థులు రెండేళ్ల కాలంలోనే మధ్యలోనే చదువులు మానేశారు. ఐఐఎంలలో కొత్త విద్యార్థులు అక్కడి వాతావరణానికి అవాటు పడేందుకు, సిలబస్ ను అవగాహన చేసుకునేందుకు సీనియర్లతో ఒరియేంటేషన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. ఐఐఎం-ఇండోర్ లాంటి సంస్థలలోనైతే చదువుల్లో వెనుకబడే విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తూ ఫ్యాకల్టీ మెంబర్లు మెంటార్ షిప్ అందిస్తున్నారు. ఐఐటీ,ఐఐఎంలలో డ్రాఫవుట్స్ అయ్యేవాళ్లల్లో కేవలం రిజర్వేషన్ల కేటగిరీల్లో అడ్మిషన్లు పొందేవారు మాత్రమే ఉండటం లేదని, అన్ని కేటగిరీల్లోనూ డ్రాఫవుట్లు ఉన్నాయని ఒక ఫ్రొఫెసర్ వివరించారు. రిజర్వుడ్ కేటగిరీల్లో సీటు దక్కించుకున్నవాళ్లు ఎంతో కష్టపడి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వాళ్లు ఉన్నారని ఫ్యాకల్టీ మెంబర్లు చెబుతున్నారు. అయితే ఉన్నత విద్యాసంస్థల్లో పెరుగుతున్న డ్రాపవుట్లకు అసలైన కారణాలు కనుగొనాల్సిన అవసరమైతే ఉందని అభిప్రాపడుతున్నారు.