Mobile AppDownload and get updated news
ప్రేమోన్మాదానికి ఓ విద్యార్థిని బలై పోయింది. తరగతిలోనే విద్యార్థిని దారుణంగా ఓ క్రూరుడు కొట్టి చంపాడు. పూర్తి వివరాల ప్రకారం... తమిళనాడులోని కరూర్‌లో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. సోనాలి అనే అమ్మాయి సివిల్ ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతోంది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఆమె క్లాసురూములో పాఠాలు వింటోంది. ఇంతలో ఓ యువకుడు క్లాసురూములోకి ప్రవేశించాడు. చేతిలో ఉన్న పెద్ద కర్రతో సోనాలి తలపై మోదాడు. ఆ దెబ్బకి తీవ్ర రక్తస్రావమైంది. వచ్చిన ఉన్మాది అంతే వేగంతో క్లాసు రూములోంచి వెళ్లిపోయాడు. జరిగిన సంఘట నుంచి తేరుకున్న ఇతర విద్యార్థినులు, ప్రొఫసర్ పోలీసులకు సమాచారం అందించి, సోనాలిని ఆసుపత్రికి చేర్చారు. ఈలోపే ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో మరణించింది. కాగా దాడి చేసిన ఉన్మాదిని ఉదయ కుమార్ గా పోలీసులు గుర్తించారు. అతడు కొన్ని రోజుల క్రితమే కాలేజీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యాడు. తన ప్రేమని అంగీకరించకపోవడం, ఆ విషయంలో జరిగిన గొడవ నేపథ్యంలోనే ఉదయ్ హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు