హైదరాబాద్: బుధవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా కురస్తున్న భారీ వర్షాలకు భాగ్యనగరం తడిచిముద్దయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షలకు ఇళ్లగోడలు కూలిన ఘటనలు చోటు చేసుకొని ప్రాణనష్టం సంభవించింది. ఇలాంటి పరిస్థిల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ వర్షాల పై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ రాజీవ్ శర్మతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులను అడిగి పరిస్థితి తెలుసుకున్న సీఎం కేసీఆర్ ..సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ , డ్రైనేజీ, మ్యాన్ హోల్స్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తెలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రాణనష్టంపై కేసీఆర్ దిగ్భ్రాంతి....
భారీ వర్షాల కారణంగా మృతి చెందిన ఘటనపై సీదిగ్భ్రాంతి ఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా నగరంలోని రామంతపూర్ లో గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. భోలక్‌పూర్‌లో పాత ఇల్లు కూలి తల్లితో సహా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ..బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
Mobile AppDownload and get updated news