ప్రపంచంలో అతి పెద్ద నదీ ద్వీపంగా అస్సాంలో ఉన్న మజులి గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ నదీ ద్వీపం బ్రహ్మాపుత్ర నదిలో ఉంది. ఈ ద్వీపం దాదాపు 880 చదరపు కిలోమీటర్ల విస్తారంలో ఉంది. ఈ ద్వీపంలో దాదాపు లక్షా 60 వేల మంది నివాసం ఉంటున్నారు. అస్సాంలో ఇది అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. తాజాగా దీనిని ఒక జిల్లాగా ప్రకటించారు. అంతకు ముందు జోర్హాట్ జిల్లాలో భాగంగా ఉంది. ఈ నియోజకవర్గాన్ని గిరిజనుల కోసం కేటాయించారు. ఈ నదీ ద్వీపం యునెస్కో గుర్తింపును కూడా పొందింది.
Mobile AppDownload and get updated news