Mobile AppDownload and get updated news
చిరంజీవి ప్రస్తుతం తన 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' షూటింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఇకపై వరుసగా సినిమాలు చేయాలనేది చిరు ప్లాన్. దానికోసం వరుస ప్రాజెక్ట్స్ ను ఫైనల్ చేస్తున్నారు. మొన్నటివరకు చిరు తదుపరి సినిమా బోయపాటి దర్శకత్వంలో ఉంటుందనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ వార్తల్లో నిజముందనే విషయం తెలుస్తోంది. నిజానికి చిరు 151వ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించాలని అనుకుంటున్నారు. గతంలో ఓ స్టేజ్ పై ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇటీవల బోయపాటి, అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు' సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. నిర్మాతగా అల్లు అరవింద్ కు లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో అల్లు అరవింద్ కూడా బోయపాటి తో, చిరంజీవిని పెట్టి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపుతుండడంతో ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి కథపై కసరత్తు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి చిరు సినిమా విడుదలయిన వెంటనే బోయపాటి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నారని సమాచారం.