Mobile AppDownload and get updated news
గో రక్షణ అనేది ఈమధ్య తరచుగా బీజేపీ వినిపిస్తోన్న నినాదం. ఇదిలావుంటే, తాజాగా గోవుల్ని రోడ్లపై కనిపించకుండా చర్యలు తీసుకునేందుకు ఓ ఉద్యమాన్నే తీసుకువస్తానంటున్నాడు బీజేపికే చెందిన ఓ కౌన్సిలర్. అహ్మెదాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని నవ వడాజ్ వార్డుకి కౌన్సిలర్ అయిన జిగ్నేష్ పటేల్ ఇకపై అహ్మెదాబాద్‌లో రోడ్లపైకి గోవుల్ని రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కార్పోరేషన్‌ని కోరనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని బోర్డు మీటింగులో లేవనెత్తుతానంటున్నాడు జిగ్నేష్. గోవులకి రోడ్లపై గడ్డి, దానా వేయడం వల్ల అవి రోడ్లపైనే తచ్చాడుతూ ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తున్నాయని, అందుకే జనం వాటికి రోడ్లపై దానా వేయడం మానేయాలని సూచించినందుకే భర్వాడ్ కమ్యునిటీ వాళ్లు తనపై దాడికి పాల్పడ్డారని జిగ్నేష్ ఆరోపిస్తుండగా.. ఆయనే తన అధికారదర్పం చూపించబోయాడని సదరు వర్గీయులు చెబుతున్నారు. గోవులు రోడ్లపైకి రావడం వల్ల ప్రజా రవాణాపరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయంటున్న జిగ్నేష్.. త్వరలోనే అహ్మెదాబాద్ రోడ్లపై గోవులు కనిపించకుండా చేయడమే తన లక్ష్యమని గట్టిగానే చెబుతున్నాడు.