కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ అధ్యక్షతన శనివారం విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో శక్రవారం రాత్రే రాజ్ నాథ్ సింగ్ నగరానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సదస్సుకు హాజరుకావడం లేదు. ఆయన బదులు ఆర్థిక మంత్రి ఈటెల నుంచి పంపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రాంతీయ సహాకారం పై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలిని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు.
Mobile AppDownload and get updated news