రాజస్థాన్లో ఒక మహిళను మూడు నెలలుగా బంధించిన అత్తింటి వారు ఆమెను చిత్రహింసల పాలు చేశారు. ఆమెను ఇనుపగొలుసులతో ఒక ఇరుకు గదిలో బంధించిన అత్తింటివారు నానారకాలుగా హింసించారు. వారి దెబ్బల దాటికి ఆ మహిళ చిక్కి శల్యమైంది. నోటి మాట కోల్పోయింది. చివరకు ఇరుగుపొరుగువారికి ఆ ఇంట్లో జరుగుతున్న తంతు గురించి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇంట్లో సోదా చేయగా ఇరుకు గదిలో బంధీగా ఉన్న ఆ మహిళ కనిపించింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదుచేసారు.
Mobile AppDownload and get updated news