Mobile AppDownload and get updated news
జగపతి బాబు ఒకప్పుడు సున్నితమైన ఫ్యామిలీ హీరో. మరిప్పుడు భయపెట్టే విలన్‌గా మారి హీరోలనే డామినేట్ చేసేంతగా స్క్రీన్‌పై అదరగొడుతున్నాడు. ఈమధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో బిజీ నటుడంటే జగపతి బాబే. వరుస ఆఫర్లు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. నిర్మాతలైతే జగ్గూ భాయ్ కోసం ఎంత పారితోషికమైనా ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు పాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మరొక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో జగపతి బాబు కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం అరవై లక్షల రూపాయలను ముట్టజెప్పినట్లు టాక్. అయితే ఈ సినిమాలో ఆయన నెగెటివ్ రోల్ చేస్తున్నారా? లేక పాజిటివ్ రోల్ లో కనిపిస్తారా..? అనే విషయం తెలియాల్సివుంది. ఈ సినిమాలో చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ నాగార్జున హిట్ సినిమాలో ఒకటైన 'నిన్నేపెళ్లాడతా'ను పెట్టాలనే ఆలోచనలో చైతూ ఉన్నట్లు చెప్తున్నారు.