దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చెందిన షిమ్, కిమ్ భార్యాభర్తలు. ఒక రోజు శృంగారంలో పాల్గొందామని షిమ్ తన భర్తను ఆహ్వానించింది. కానీ అతడు అందుకు అంగీకరించలేదు. అయినప్పటికీ ఆమె అతడితో బలవంతంగా సెక్స్‌లో పాల్గొందట. అంతటితో ఆగకుండా ఒక రోజుకిపైగా ఇంట్లోనే బంధించిందట. దీంతో తిక్క రేగిన మనోడు కోర్టును ఆశ్రయించాడు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఆమె రేప్ చేయాలేదని తీర్పు వెలువరించింది. అయితే భర్తను నిర్భందించి, గాయపర్చినందుకు గానూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. భార్యతో బుద్ధిగా మెలగాలంటూ కిమ్‌కు తలంటింది. భాగస్వామి అంగీకారం లేకుండా బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని 2013లో దక్షిణ కొరియా నేరంగా గుర్తించింది. అప్పటి నుంచి కొరియాలో ఈ తరహా కేసు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Mobile AppDownload and get updated news