వరంగల్: విమోచన దినోత్సవాన్ని జరపడానికి కేసీఆర్ భయపడుతున్నారని అమిత్ షా విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హన్మకొండలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో దేశభక్తులు పుట్టిన గడ్డ ..తెలంగాణ అని ప్రశంసించారు. దేశ స్వాతంత్య్రం కోసం తెలంగాణకు చెందిన ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను బలిచ్చారని కొనియాడారు. త్యాగమూర్తులను స్మరించుకొనేందుకు జరుపుకునే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ఓవైసీ భయంతోనే సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవానికి దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. ఒక్క బీజేపీ మాత్రమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ధైర్యంగా జరుపుతుందని అమిత్ షా వెల్లడించారు.
Mobile AppDownload and get updated news