ఢిల్లీ: కశ్మీర్‌లోని ఆర్మీక్యాంప్‌పై ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. ఉగ్రమూకలు మరిన్ని చోట్ల దాడులకు తెగబడే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. హోంశాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదస్థితిలో ఎవరైనా కనిపించినా.. అనుమానాస్పద వస్తువులు చూసినా తమకు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఈ రోజు ( ఆదివారం ) కశ్మీర్ లోని యురి సెక్టర్ ఉగ్రమూకల దాడిలో 17 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు దాడికి పాల్పడిన ముష్కరులను పట్టుకునేందుకు హోంశాఖ ముమ్మర చర్యలు చేపడుతోంది. ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించి.. హెలికాఫ్టర్ల ద్వారా ఉగ్రమూకల జాడ కనిపెట్టే ప్రయత్నాల్లో కేంద్ర హోంశాఖ నిమగ్నమైంది.
Mobile AppDownload and get updated news