Mobile AppDownload and get updated news
బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ కు స్మితాపాటిల్ పురస్కారం ప్రకటించడాన్ని ఆక్షేపిస్తూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కళాభినేత్రిగా స్మితాపాటిల్ ఎక్కడ.. నిన్న గాక మొన్న వచ్చిన కత్రినా కైఫ్ ఎక్కడా? అంటూ నెటిజన్లు చర్చలు సాగిస్తున్నారు. కొందరైతే అసలు కత్రినాకు స్మితాపాటిల్ అంటే ఎవరో తెలుసా అని కూడా నిలదీశారు. మరికొందరైతే, కత్రినాకు స్మితా పాటిల్ అవార్డు ఇచ్చారు.. మరి రాహుల్ గాంధీకి నోబెల్ అవార్డు కూడా ఇచ్చేయండని సెటైర్లేశారు. ఇంకొందరేమో.. ఇంతకీ ఈ స్మితాపాటిల్ ఎవరా అంటూ కత్రినా ఇప్పుడు గూగుల్లో వెతుకులాడుతుంటుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో ఈ విషయమై కొన్ని ట్వీట్లు చేశారు. కత్రినాకైఫ్ ఈ అవార్డు అందుకోవడమంటే కత్రినాకంటే స్మితాపాటిల్ కే పెద్ద గౌరవంగానే భావించాల్సి ఉంటుందన్నారు. స్మితాపాటిల్ సినిమాల్లోకి రాకముందే మంచి పేరు ప్రతిష్టలకు తెచ్చుకున్నారు.... కానీ, కత్రినాకు అలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్, నటించడం రాకపోయినా, డ్యాన్సులు వేసే నైపుణ్యం లేకపోయినా సినీరంగంలో కత్రినా పైకెదిగారన్నారు. ఈ ట్వీట్లు చదివిన వాళ్లు ఇంతకీ వర్మ కత్రినాను వెనకేసుకువచ్చాడా.. లేక ఇన్ డైరెక్టుగా వెటకారం చేస్తూ మాట్లాడాడా అని బుర్రలు గోక్కుంటున్నారు.