Mobile AppDownload and get updated news
కాపులను బీసీల్లో కలపాలన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణను మంజునాథ కమిషన్ సోమవారం నుంచి ప్రారంభించింది. అభిప్రాయ సేకరణలో భాగంగా ఈ రోజు తిరుపతిలో పర్యటించింది. తిరుపతి నరగపాలక సంస్థ సమావేశ మందిరం వేదికగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయలను సేకరించింది. బీసీల్లో చేర్చిస్తే తాము నష్టపోతామని ఒకవైపు బీసీలు ఆవేదన వ్యక్తం చేయగా.. బీసీల్లో చేర్చకుంటే తాము అందరితో పాటు సమానంగా ఎదగలేమని కాపు వర్గాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కాగా ఈ 26వ తేదీ నుంచి కడప జిల్లాలో ముంజునాథ్ కమిటీ పర్యటించనుంది. అక్టోబర్ 17 నుంచి అనంతపురం, 24వ తేదీ నుంచి కర్నూలు జిల్లాల్లో కమిషన్ పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయలను సేకరించనుంది. రాయలసీమ జిల్లాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించే షెడ్యూల్ ఖరారు చేస్తారు.