అమెరికా, ఆస్ట్రేలియా పత్రికలు మరోమారు తమ జాత్యహంకారాన్ని బయటపెట్టుకున్నాయి. ఆస్ట్రేలియాలో భారతదేశాన్ని కించపరుస్తూ ప్రచురించిన కార్టూన్ ఒకటి తీవ్రస్థాయిలో వివాదానికి కారణమైంది. ఇటీవల పారిస్ నగరంలో జరిగిన ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో అగ్ర రాజ్యాల పోకడలకు వ్యతిరేకంగా గళమెత్తి, అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా వ్యవహరించిన భారతదేశ వైఖరిని గిట్టని బిల్ అనే కార్టూనిస్ట్ ఒక చిత్రాన్ని గీసాడు. ఆ కార్టున్లో దోవతులు, తలపాగాలు ధరించిన బక్క పలుచని అనాగిరక భారతీయులు నేలపై కూర్చుని ఉంటారు. వారి మధ్యలో ఐక్యరాజ్యసమితి పంపిణీ చేసిన కాలుష్య రహిత సోలార్ విద్యుత్ ప్యానెళ్లు నేలపైన పడి ఉంటాయి. సదరు భారతీయులు ఆ ప్యానెళ్లను పగులకొట్టి తినేందుకు ప్రయత్నించి, అవి బాగుండకపోవడంతో పడేస్తున్నట్లు చూపుతూ ఒక చిత్రాన్ని ఆ జాత్యహంకార పైత్యం తలకెక్కిన కార్టూనిస్ట్ గీసాడు. ఆ కార్టూన్లో అతగాడు అంతటితో ఆగలేదు. ఒక ముసలి వ్యక్తి ఆ సోలార్ ప్యానెల్ ముక్కలను మామిడికాయ పచ్చడిలో నంజుకుని తినేందుకు యత్నిస్తూ ఉంటాడు. ఆ కార్టూన్ చూసిన వారంతా ఇది కచ్చితంగా పాశ్చాత్యదేశాల జాత్యహంకారానికి నిదర్శనమేనని ఆగ్రహం వ్యక్తం చేసారు.
![]()
గత వారం కూడా న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కార్టూన్ ప్రచురించింది. ఆ పత్రికలో ఇండియాను రైలు పట్టాలపై కూర్చున్న ఏనుగుతో పోల్చింది. ఆ ఏనుగు (ఇండియా) పట్టాలపై అడ్డంగా కూర్చోవడంతో రైలు ఆగిపోయినట్లు ఆ చిత్రాన్ని ప్రచురించింది. ఆ రైలును పారిస్ వాతావరణ సదస్సుగా పేర్కొన్నారు. ఆ కార్టూన్ కూడా సర్వత్రా భారతీయుల ఆగ్రహాన్ని చవిచూసింది.
Mobile AppDownload and get updated news