రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాల్ మనీ వ్యవహారంపై ఇవాళ గవర్నర్ నరసింహన్ కు వైసీపీ అధినేత ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీకి చెందిన నేతలు ఉన్నారని జగన్ ఆరోపిస్తున్నారు. అలాగే దీన్ని అరికట్టే విషయంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ను కలిసి టీడీపీ నేతలపై జగన్ ఫిర్యాదు చేయనున్నారు. కాల్ మనీ వ్యవహారంపై ప్రభుత్వానికి సోమవారం ఆయన బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అధిక వడ్డీలకు అప్పులిచ్చి రుణాలు తీర్చలేని వారి ఇళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు రుణ గ్రహితల ఇళ్లలోని మహిళలను వ్యభిచారం లోకి లాగుతున్న విజయవాడ కాల్ మనీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.
Mobile AppDownload and get updated news