కాల్ మనీ వ్యవహారంపై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ పోలీసులు నడుంబిగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డీ వ్యాపారుల ఇళ్లలో మంగళవారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. కృష్ణ, గుంటూరు,కడప జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి వడ్డీ వ్యాపారుల ఇళ్ల ల్లోంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అధిక వడ్డీలకు డబ్బులిచ్చి రుణాలు తీర్చమని వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ రాముడు సూచించారు. అధిక వడ్డీలకు అప్పులిచ్చి రుణాలు తీర్చలేని వారి ఇళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు రుణ గ్రహితల ఇళ్లలోని మహిళలను వ్యభిచారం లోకి లాగుతున్న విజయవాడ కాల్ మనీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేథప్యంలో ఏపీ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు.
Mobile AppDownload and get updated news