కాల్ మనీ వ్యవహారానికి వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రవీంద్ర భారతీ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో వైసీపీ అధినేత జగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పేదల బతుకులతో ఆడుకునే కాల్ మనీ వ్యవహారాన్ని ప్రభుత్వమే ప్రొత్సహిస్తోందని ఆరోపించారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది వెల్లడించారు. కాల్ మనీ వ్యవహారాన్ని అడ్డుపెట్టు తమ పార్టీకి చెందిన నేతలు,కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తోందన్నారు. కాల్ మనీ వ్యవహారంతో పాటు కల్తీకల్లు, బాక్సైజ్ తవ్వకాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైసీపీ అధినేత జగన్ వెల్లడించారు.
Mobile AppDownload and get updated news