Mobile AppDownload and get updated news
దూర ప్రాంతాలకు వెళ్లే రైల్వే ప్రయణికులకు శుభవార్త.. ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లకు శాస్వతంగా ఒక ఏసీ టూ టైర్ అదనపు బోగి ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మద్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇక నుంచి సికింద్రాబాద్ - దర్భంగ ఎక్స్ ప్రెస్, దర్భంగ -సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ -సాయినగర్ (షిర్డీ) ఎక్స్ ప్రెస్ , సాయినగర్ -సికింద్రాబాద్ (షిర్డీ) ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ - తిరుపతి (సెవెల్ హిల్స్) సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, తిరుపతి - సికింద్రాబాద్ (సెవెల్ హిల్స్) సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, తిరుపతి - కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, కరీంనగర్ -తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లకు ఒక అదనపు బోగి జోడించనున్నారు. ఈ ఎనిమిది రైళ్లకు ఏసీ టూ టైర్ బోగీలు ఏర్పాటు చేయడం ద్వారా 368 అదనపు బెర్తులు అందుబాటులోకి వస్తాయని దక్షిమధ్య రైల్వే పీఆర్ వో ఉమాశంకర్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం రైల్వే వెబ్ సైట్..లేదా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు.