Mobile AppDownload and get updated news
స్వరజ్ఞాని ఇళయరాజాకు కూడా కోపమొచ్చింది. చెన్నై వరద బాధితుల సహాయార్థం స్వచ్చందంగా ముందుకొచ్చి అహర్నిశలు పనిచేసిన వ్యక్తులకు కృతజ్ఞత తెలిపే కార్యక్రమాన్ని శుక్రవారం నాడు చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా కూడా పాల్గొన్నారు. ఆయన కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం ఒక విలేకరి.. మహిళలను కించపరిచేలా శింబు, అనిరుథ్ కలిసి రాసిన వివాదాస్పద గీతం గురించి మీ అభిప్రాయం ఏమిటని ఆయనను ప్రశ్నించారు. దాంతో ఆయనకు ఒక్కసారిగా కోపం వచ్చింది. కాస్త గట్టిదైన స్వరంతో ఆయన విలేకరికి బదులిస్తూ.. ఆ పాట గురించి మాట్లాడేందుకు తాను ఆ కార్యక్రమానికి రాలేదన్నారు. అది మినహాయించి కార్యక్రమం మొత్తం ఎటువంటి వివాదాలు లేకుండానే పూర్తయ్యింది. ఇళయరాజాకు కోపం వచ్చిందని తెలియగానే సత్వరమే స్పందించిన కార్యక్రమ నిర్వాహకులు జోక్యం చేసుకుని ఆయన వేదిక నుండి లోపలి గదికి తీసుకెళ్లారు.