సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలపై ఫైనాన్షియర్స్ దాడులు.. సూపర్‌హిట్ అయితే ఇన్‌కమ్‌టాక్స్ దాడులు తప్పవు మరి. ఈ కోవలోనే చిన్న చిత్రంగా విడుదలై ఘనవిజయం సాధించిన 'కుమారి 21ఎఫ్' టీమ్‌తోపాటు వారి కార్యాలయాలు, నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ వాళ్లు సోదాలు జరిపినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ న్యూస్ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం 'కుమారి 21ఎఫ్'. ఈ చిత్రానికి సుకుమార్‌తో పాటు థామస్ రెడ్డి, విజయ్ బండ్రెడ్డిలు కూడా నిర్మాతలుగా వున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు రూ. 20 కోట్ల వరకు ఈ చిత్రం కలెక్ట్ చేసిందనే వార్త ఆనోట.. ఈ నోట ఇన్‌కమ్‌టాక్స్ వారికి కూడా చేరింది. ఇంకేముంది.. ఇన్‌కమ్‌టాక్స్ టీమ్ 'కుమారి 21ఎఫ్' టీమ్ ఆఫీస్, ఇళ్లల్లో సోదాలు నిర్వహించారట. అయితే అప్పటికి పక్కా అకౌంట్స్ రెడీ చేసుకున్న సుకుమార్ అండ్ టీమ్‌పై ఆ దాడి పెద్దగా ప్రభావం చూపలేదని.. కేవలం రికార్డులు పరిశీలించి... కట్టాల్సిన టాక్స్ అమౌంట్ చెప్పి.. ఇన్‌కమ్ టాక్స్ టీమ్ వెళ్లిపోయారని తెలుస్తోంది. సో.. ఆడియెన్స్‌తో పాటు ఇన్‌కమ్‌టాక్స్ వాళ్లను కూడా కుమారి టీమ్ బాగానే మెప్పించిందన్న మాట.
Mobile AppDownload and get updated news