ఆంధ్రుల కలల రాజధాని అమరావతి చుట్టూ అతి పెద్ద అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణమవబోతోంది. రింగ్ రోడ్డు నిర్మాణానికి దాదాపు 8వేల ఎకరాల స్థలం అవసరమని అధికారులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని మునిసిపల్ మంత్రి నారాయణ ఆదివారం నాడు చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు కోసం భూసమీకరణ ద్వారా భూములను సేకరిస్తామని వెల్లడించారు. త్వరలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోందన్నారు. ఇదిలా ఉండగా రాజధాని గ్రామాల రైతులకు భూమిని ఎక్కడ ఇవ్వాలనే అంశంతో పాటు వివిధ కీలకాంశాలకు సంబంధించిన డ్రాప్ట్ ఈ నెలాఖరుకు సిద్ధమవుతుందని మంత్రి చెప్పారు. రాజధాని నగరంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి అనువైన స్థలం కోసం అధికారులు అన్వేషిస్తున్నారన్నారు.
Mobile AppDownload and get updated news