Mobile AppDownload and get updated news
రీసెంట్‌గా జరిగిన 'లోఫర్' ఆడియో వేడుకకు ప్రభాస్ అతిధిగా వచ్చి నప్పుడు పవన్‌కళ్యాణ్ అభిమానులు ఎంత హడావుడి చేశారో అంతా చూశారు. ఆ సమయంలో ప్రభాస్ చాలా ఫీలయ్యాడని సినీ వర్గాలు చెప్పుకున్నాయి. ఆ ఆడియో కార్యక్రమం తర్వాత పూరీ జగన్నాధ్ ఓ ఇంటర్వ్యూలో పవన్‌కళ్యాన్ ఫ్యాన్స్‌ని తప్పుబట్టారు. ఆ ఇంటర్వ్యూలో పవనకళ్యాణ్ తన అభిమానులను హద్దుల్లో ఉంచుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఆ సలహా చాలు ఆ ఆడియో వేడుకలో పూరీ అండ్ ప్రభాస్ ఎంతగా హర్ట్ అయ్యారో చెప్పడానికి. అయితే తాజాగా జరిగిన శర్వానంద్ 'ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్ర ఆడియో వేడుకలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా గీత దాటారు. బాహుబలి అంటూ నినాదాలు చేశారు. స్పీచ్‌లకు అడ్డుతగిలారు. అంతే కాకుండా మాట్లాడే ప్రతీ ప్రముఖుడి చేత ప్రభాస్ అంటే ఇష్టం అని చెప్పేలా చేశారు. ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ 'ఐ లవ్ యూ', 'డార్లింగ్స్' అంటూ సంబోధించడం మరింత చిరాకును తెప్పించింది. ఆ రోజు పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదో తప్పు చేశారని ఫీలైన వారు..తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన దానిపై ఎలా స్పందిస్తారో..మరి..?