పొడవాటి శరీరం, నీలికళ్లతో ఆకట్టుకునే 20 ఏళ్ల షయామా అబ్దెల్ రహమాన్ అనే యువతి మిస్ ఇరాక్ కిరీటాన్ని గెలుచుకుంది. చాందసవాదుల బెదిరింపులకు లొంగకుండా షయామా మిస్ ఇరాక్ పోటీల్లో పాల్గొని శభాష్ అనిపించుకుంది. కిరీటాన్ని కైవసం చేసుకున్న అనంతరం షయామా మాట్లాడుతూ చాందసవాదం కారణంగా ఇరాక్ ఇప్పటివరకు మిగతా ప్రపంచం కన్నా వెనకపడిపోయిందని, ఇప్పుడిప్పుడే తమ దేశం ఆ సంకెళ్లను తెంచుకుని ముందుకు సాగడం తనకు ఆనందం కలిగిస్తోందని చెప్పింది. పోటీల ఫైనల్స్ లో పాల్గొన్న వారంతా షయామా పేరును ముక్తకంఠంతో ఘోషించడంతో నిర్వాహకులు ఆమెకే టైటిల్ ఖరారు చేసారు.
ఇరాక్ ప్రజలు జీవితాన్ని ప్రేమించరనే ప్రచారం బయటి ప్రపంచంలో ఉంది. ఈ తరహా పోటీలను నిర్వహించడం ద్వారా మాకు కూడా జీవితంపై ప్రేమ ఉందని చెప్పడమే దీని ఉద్దేశమని నిర్వాహకుల్లో ఒకరైన హమామ్ అల్-ఒబెయ్దీ చెప్పారు.
Mobile AppDownload and get updated news