మెగాస్టార్‌గా సుమారు 30 సంవత్సరాల పాటు టాలీవుడ్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన చిరంజీవి టాలీవుడ్‌ని అవమానించాడా..? అవుననే అంటున్నాయి తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు. ఎందుకంటే ప్రపంచ సినిమాని శాసించగలదనే పేరు సంపాదించిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి కథే అందించే రైటరే దొరకలేదంటే నిజంగా ఇది అవమానం కాక మరేమిటని సినీ జనాలంటున్నారు. 'భజరంగీ భాయిజాన్' వంటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రానికి కథ అందించింది మన తెలుగు రైటర్ కాదా అని గుర్తుచేస్తున్నారు. ఇది ఒకరకంగా తెలుగు చిత్ర పరిశ్రమ అభిమానులకు, చిత్ర వర్గాలకు కూడా మింగుడు పడటం లేదుట. దానికి తోడు చిరంజీవి తన 150వ చిత్రానికి ఓ తమిళ చిత్రాన్ని ఎన్నుకోవడం కూడా టాలీవుడ్‌ని తీవ్రంగా అవమానించడమేనని కొందరు ప్రముఖులు భావిస్తున్నారు. తెలుగు కథకులు ఎన్నో కథలు వినిపించినా చిరంజీవికి అవి నచ్చలేదు. మరి ఈ నేపథ్యంలో నిజంగా చిరంజీవి ఏం కోరుకుంటున్నారనేది అంతుపట్టడం లేదు. 'కత్తి'లో ఆయన కోరుకునేది ఏముంది? అల్రెడీ హిట్టయిన 'కత్తి'ని ఇప్పటికే అందరూ చూసేశారు. ఎంత మార్చితే మాత్రం.. చిరంజీవి చేస్తే మళ్ళీ చూస్తారా..? అసలే కలెక్షన్స్ లెక్కేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో..చిరంజీవి..అల్రెడీ వచ్చిన చిత్రాన్ని చేయడం ఎంత వరకు శ్రేయస్కరం? చిరంజీవి తాజా ఇన్నింగ్స్‌కి ఈ 'కత్తి' రిబ్బన్ కటింగ్‌కి ఉపయోగపడుతుందా..? లేక రివర్స్‌లో కట్‌చేస్తుందా..! అనే అనుమానాలు మెగా ఫ్యాన్స్‌లో సైతం ఉన్నాయి. మరి చిరంజీవి ఈ 150 గండాన్ని..ఆ 'కత్తి'తో ఎలా గట్టేక్కేస్తాడో..చూద్దాం..!
Mobile AppDownload and get updated news