ఢిల్లీ నగరంలో నెలలో పదిహేను రోజులపాటే వాహనాలను రోడ్లపైకి అనుమతించాలని, ఆ సమయంలో ఇతర అవసరాలకు పాఠశాలల బస్సులను వినియోగించాలన్న ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాఠశాలల యాజమాన్యాలు వ్యతిరేకించాయి. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఢిల్లీ అన్ ఎయిడెడ్ రికగ్నైజ్జ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ యాక్షన్ కమిటీ ఆ రాష్ట్ర విద్యా శాఖకు లేఖ రాసింది. సరి-బేసి నెంబర్ ప్లేట్ల విధానానికి తాము వ్యతిరేకం కాదని, కాకపోతే, దీనికన్నా మెరుగైన ప్రత్యామ్నాయాల గురించి ప్రభుత్వం ఆలోచించి ఉండాల్సిందని యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎస్.కె.భట్టాచార్య ఆ లేఖలో పేర్కొన్నారు. కొత్త విధానంలో భాగంగా పాఠశాలల బస్సులను బయటి అవసరాలకు ఇవ్వాలనే నిబంధన వల్ల పాఠశాలలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పాఠశాల బస్సులను విద్యేతర కార్యక్రమాలకు ఉపయోగించడమంటే ఢిల్లీ విద్యా చట్టం-1973ను ఉల్లంఘించడమేనన్నారు.
Mobile AppDownload and get updated news