మాధేశీయుల డిమాండ్లకు ఎట్టకేలకు నేపాల్ ప్రభుత్వం తలొగ్గింది. చట్ట సభల్లో ప్రాతినిథ్యంతో పాటు నియోజకవర్గ పునర్విభజన చేయాలన్న వారి డిమాండ్లకు ఒప్పుకుంది. అందులో భాగంగా ఆ దేశ కొత్త రాజ్యాంగాన్ని సవరించాలని నిర్ణయించింది. కాగా, మాధేశీల విషయంలో నేపాల్లో వచ్చిన మార్పు పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. నేపాల్ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నానని ప్రకటించింది. నేపాల్లో నెలకొన్న సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు నేపాల్ ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయమని భారత విదేశాంగ శాఖ సోమవారం నాడు స్పందించింది. మాధేశీయుల విషయంలో నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ దేశంలోని అన్ని రాజకీయపార్టీలు మద్దతిచ్చేందుకు కలిసి రావాలని సూచించింది. ఈ విషయంలో నేపాలీ పార్టీలు పరిపక్వ ధోరణి చూపాలని కోరింది. వారి డిమాండ్లను నెరవేర్చి, రాజ్యాంగాన్ని సవరించాలని ఆదివారం రాత్రి అత్యవసరంగా ఏర్పాటుచేసిన నేపాల్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ![]()
డిమాండ్ల సాధన కోసం నేపాలీ మాధేశీల ఆందోళన (ఫైల్)
![]()
మాధేశీ సమస్యపై నేపాల్ ప్రభుత్వంతో సుష్మా స్వరాజ్ చర్చలు (ఫైల్)
![]()
నేపాల్లో ఇటీవలి ఆందోళనలో మాధేశీ ఆందోళనకారులు
Mobile AppDownload and get updated news