ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న మల్టీలింగ్వల్ సినిమాతో తెరంగేట్రం చేస్తున్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. క్రికెటర్ జీవితం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందనుంది. అయితే తమిళం, మలయాళం భాషలపై పట్టున్న శ్రీశాంత్ ప్రస్తుతం ఈ సినిమాకి అవసరమైన తెలుగు డిక్షన్ కోసం ప్రత్యేకించి ఓ ట్యుటర్ సహాయంతో తెలుగు నేర్చుకుంటున్నాడు. మూడు రోజుల వర్క్‌షాప్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఫిలింసిటీలో ఇతర నటీనటులతో కలిసి నటనపై శిక్షణ సైతం తీసుకుంటున్నాడు. సానా యాది రెడ్డి డైరెక్ట్ చేయబోయే ఈ సినిమాని మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
Mobile AppDownload and get updated news