ప్రేమ్ రతన్ ధన్ పాయో తర్వాత సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సుల్తాన్. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సల్మాన్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది మొదటి నుంచి ఓ పెద్ద మిస్టరీగా మారింది. దీపికా పదుకునే నుంచి పరిణీతి చోప్రా, కత్రినా కైఫ్ వరకు చాలామంది హీరోయిన్ల పేర్లు ఆ జాబితాలో వినిపించాయి. కానీ తాజాగా ఆ జాబితాలో లేని అనుష్కా శర్మని ఫైనల్ చేసినట్లు మేకర్స్ స్పష్టంచేశారు. సుల్తాన్ సినిమా అధికారిక ట్విటర్ ఎకౌంట్‌లో ''మీట్ సుల్తాన్స్ లీడింగ్ లేడీ'' అని అనుష్కా శర్మ పేరుని ప్రకటిస్తూ ఓ ట్వీట్ చేశారు మేకర్స్.
Mobile AppDownload and get updated news